Home న్యూస్ నైజాంలో ఎన్టీఆర్ లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్ రిపోర్ట్( ఓ రేంజ్ లో ఇంప్రూవ్ మెంట్)

నైజాంలో ఎన్టీఆర్ లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్ రిపోర్ట్( ఓ రేంజ్ లో ఇంప్రూవ్ మెంట్)

2

     యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం ఆల్ టైం పీక్స్ లో ఉంది, టెంపర్ నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, జైలవకుశ మరియు అరవింద సమేత సినిమాల తో వరుసగా హిట్లు కొట్టిన ఎన్టీఆర్ కి అరవింద సమేత తిరుగు లేని క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా కన్నా ముందు ఎన్టీఆర్ స్ట్రాంగ్ ఏరియాలు అయిన సీడెడ్, ఆంధ్రాలతో పాటు ఇప్పుడు ఓవర్సీస్ మరియు కర్ణాటకలు కూడా స్ట్రాంగ్ జోన్ గా మారాయి.

ఇక మిగిలున్న నైజాం ఏరియాలో ఇప్పటివరకు నటించిన సినిమాల్లో బాద్ షా 12 కోట్లకు చేరువగా వచ్చింది. 2016 లో సంక్రాంతి కానుకగా వచ్చిన నాన్నకుప్రేమతో సినిమాతో నైజాంలో కూడా రికార్డులు సృష్టించాలి అనుకున్నా నాగార్జున సొగ్గాడే చిన్నినాయనా సినిమా ఫుల్ డామినేషన్ తో కలెక్షన్స్ మందగించాయి.

ఒక్కసారి ఎన్టీఆర్ లాస్ట్ 5 మూవీస్ నైజాంలో ఎంత కలెక్ట్ చేశాయో చూద్దాం
అరవింద సమేత—- 21.7 కోట్లు
జై లవ కుశ—-17.15 కోట్లు
జనతా గ్యారేజ్———- 19.45 కోట్లు
నాన్నకు ప్రేమతో————10.90 కోట్లు
టెంపర్—————-10.80 కోట్లు
రభస ———– 7.28 కోట్లు
రామయ్య వస్తావయ్యా———-8.90 కోట్లు
బాద్ షా—————-11.80 కోట్లు
ఇవి ఎన్టీఆర్ కెరీర్ లో నైజాంలో లాస్ట్ 7 మూవీస్ కలెక్షన్స్ రిపోర్ట్

మిగిలిన ఏరియాల్లో జోరు చూపినా నైజాం లో ఎన్టీఆర్ కొంచం వీక్ అని ఇది వరకు ఒక అపవాదు ఉండేది, కానీ రీసెంట్ టైం లో వరుసగా ఇక్కడ సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతున్న ఎన్టీఆర్ ఎట్టకేలకు అరవింద సమేత సినిమా తో 20 కోట్ల మార్క్ ని అందుకున్నాడు.

త్వరలోనే టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి తెరకెక్కుతున్న RRR తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ ఇక్కడ మరింత ఇంప్రూవ్ అవుతుంది అనడం లో ఎలాంటి డౌట్ లేదు. బాహుబలి రేంజ్ ఇంపాక్ట్ ని కలిగిస్తున్న RRR బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భీభత్సం సృష్టిస్తుందో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here