Home న్యూస్ డే 18 ఓపెనింగ్స్… కుమ్ముతున్నాడు

డే 18 ఓపెనింగ్స్… కుమ్ముతున్నాడు

0

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర బాక్స్ ఆఫీస్ దగ్గర బహుశా చివరి అతి పెద్ద రోజు లో ఎంటర్ అయింది. ఆదివారం రోజు అవ్వడం తో సినిమా శనివారం కన్నా కూడా జోరుగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతూ అన్నీ చోట్లా మంచి ఆక్యుపెన్సీ తో ఓపెన్ అయింది. వచ్చే వారం నుండి దీపావళి సినిమాలతో సందడి ఉంటుంది కాబట్టి ఈ రోజు బిగ్గెస్ట్ డే అని చెప్పాలి.

ఆ అడ్వాంటేజ్ ని అరవింద సమేత బాగానే వాడుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ గానే ఓపెన్ అయింది. 17 వ రోజు తో పోల్చితే ఓపెనింగ్స్ 10% ఇంప్రూవ్ మెంట్ ని మొదటి రెండు షోలకి చూపగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.

దాంతో ఈ రోజు కలెక్షన్స్ మినిమమ్ 70 లక్షల రేంజ్ లో అయితే కంఫామ్ గా వస్తాయని తెలుస్తుంది. ఇక నైట్ షోల లో గ్రోత్ బాగుంటే ఈ లెక్క 85 లక్షల కి మించి ఉండే అవకాశం కూడా పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here