యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద నాలుగు వారాలను పూర్తి చేసుకుంది. సినిమా 28 రోజుల్లో టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ అద్బుతమైన కలెక్షన్స్ తో ఎన్టీఆర్ కెరీర్ లోనే సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా టాలీవుడ్ హిస్టరీ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.
సినిమా మొత్తం మీద 90.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించగా అందులో రెండు రాష్ట్రాలలో 66.4 కోట్ల బిజినెస్ ని అందుకుంది. దాంతో రెండు రాష్ట్రాలలో 67.4 కోట్ల టార్గెట్ తో అలాగే వరల్డ్ వైడ్ గా 91.4 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ గా
4 వారాలు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే…Nizam: 21.57Cr, Ceeded:17.52cr, UA: 8.6cr, West:4.79cr, East: 5.48cr, Guntur: 8cr, Krishna: 4.91cr, Nellore: 2.77cr, AP&TS Total Share: 73.64cr..KA 10.2cr, ROI 2.8cr, USA 8.9cr, UAE-GCC: 1.3cr, Aus-NZ: 0.8cr ROW 0.9cr, Total 24.9cr, Total 28 Days Collections : 98.54cr
మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 4 వారాలకు గాను సినిమా 66.4 కోట్ల బిజినెస్ కి 73.64 కోట్ల షేర్ ని సాధించి 7.2 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 90.4 కోట్ల బిజినెస్ కి 98.54 కోట్ల షేర్ ని అందుకుని 8.1 కోట్లకు పైగా లాభాన్ని అందుకుంది.
రెండు రాష్ట్రాలలో అలాగే ఓవర్సీస్ లో మైనర్ నష్టాలు వచ్చినా సినిమా మొత్తం మీద బిజినెస్ కి మంచి ప్రాఫిట్స్ ని ఓవరాల్ గా సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ వీకెండ్ తర్వాత సినిమా టోటల్ రన్ కంప్లీట్ అవుతుంది అని చెప్పొచ్చు. సుమారు 80 థియేటర్స్ లో సినిమా దీపావళి వీకెండ్ ని ముగించనుంది…