Home న్యూస్ 150 కోట్ల సింహాసనంపై మచ్చలపులి!!

150 కోట్ల సింహాసనంపై మచ్చలపులి!!

0

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 9 రోజులలో టోటల్ గా 88.6 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 145 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా 10 వ రోజుని ఆల్ మోస్ట్ 8 వ రోజు లెవల్ లో మొదలు పెట్టగా రోజు ని ఘనంగానే ముగించింది.

ఓవరాల్ గా రెండు రాష్ట్రాల కలెక్షన్స్ 9 వ రోజు లెవల్ లో లేకపోయినా 8 వ రోజు లెవల్ లో 2.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూ గా ఉన్నట్లు సమాచారం. దాంతో సినిమా మరో సారి 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ మరో 40 లక్షల దాకా ఉంటుందని సమాచారం.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గ్రాస్ ఇప్పుడు హిస్టారికల్ 150 కోట్లకి చేరువగా ఉండే చాన్స్ ఉందని సమాచారం. 11 వ రోజు మొదటి షోల సమయనికి సినిమా 150 కోట్లని కంప్లీట్ చేసుకోనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో మొట్టమొదటి 150 కోట్ల గ్రాస్ మూవీ గా అరవింద సమేత అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here