13 ఏళ్ల క్రితం 2009 టైం లో వరల్డ్ వైడ్ సినీ లవర్స్ ని ఓ డిఫెరెంట్ ఊహా లోకంలో విహరించేలా చేసిన సినిమా అవతార్… స్పెక్టాక్యులర్ విజువల్ వండర్ లా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన 13 ఏళ్ల తర్వాత రెండో పార్ట్ ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ డిసెంబర్ లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఆ సినిమా ముందు మరోసారి అవతార్ మ్యాజిక్ ని ఆడియన్స్ కి గుర్తు చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీతో….
4K HDR బెస్ట్ 3D ఎఫెక్ట్స్ తో రీ మాస్టర్ వర్షన్ ని వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 23న రీ రిలీజ్ చేశారు, ఇండియాలో కూడా భారీ ఎత్తున రీ రిలీజ్ అయిన ఈ సినిమా కి మొదటి రోజు వచ్చిన రెస్పాన్స్ సెన్సేషనల్ అని చెప్పాలి.
రీ రిలీజ్ మూవీ కి మొదటి రోజు ఇండియాలో అన్ని వర్షన్ లు కలుపుకుని ఏకంగా 2.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ సొంతం అయ్యాయట. రీ రిలీజ్ లో ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు అవతార్ సినిమా బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సైతం కొత్త రిలీజ్ లను డామినేట్ చేస్తూ కొన్ని సెంటర్స్ లో అవతార్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కి రీ రిలీజ్ లో ఇలాంటి ఓపెనింగ్స్ ని చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్యర్యపోగా సీక్వెల్ కి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ జాతర ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు అందరూ..