Home న్యూస్ ఇన్ని కండీషన్స్ ఏంటి సామి…తేలని లెక్కల గొడవ!!

ఇన్ని కండీషన్స్ ఏంటి సామి…తేలని లెక్కల గొడవ!!

0

వరల్డ్ వైడ్ గా ఈ శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఎపిక్ మూవీ అవతార్ 2 కోసం సినీ లవర్స్ అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డుల బెండు తీసే అవకాశం ఉన్న ఈ సినిమా ఇండియాలో కూడా ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 2 వారాల ముందే మొదలు అవ్వగా ఓవరాల్ గా బుకింగ్స్…

జోరుని ఇప్పుడు పెంచుతూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా కండీషన్స్ కొంచం ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తుంది. మాములుగా తెలుగు సినిమాలకు 55-60% వరకు షేర్ వెళుతూ ఉంటుంది బయ్యర్స్ కి…. అంటే 100 లో అన్ని టాక్స్ లు కటింగ్స్ పోనూ 55-60 వరకు షేర్ వస్తుంది…కొన్ని కొన్ని సినిమాలకు 65% వరకు షేర్ ఉంటుంది, ఇక డబ్బింగ్ మూవీస్ కి 50% కి కొంచం అటూ ఇటూగా షేర్ ఉంటుంది…

కానీ అవతార్ 2 ని ఇక్కడ లోకల్ థియేటర్స్ తో రిలీజ్ చేస్తున్న డిస్నీ వాళ్ళు సింగిల్ స్క్రీన్స్ కి 30% అలాగే మల్టిప్లెక్సులకి 40% వరకు మాత్రమే షేర్ ఇస్తామని…అందుకు ఓకే అంటే చెప్పండి సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసుకోవచ్చని కండీషన్ పెడుతున్నారట. అందుకే ఇప్పటి వరకు సింగిల్ స్క్రీన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదని సమాచారం.

వీటితో పాటు సినిమా కచ్చితంగా సంక్రాంతి వరకు థియేటర్స్ లో ఉండేలా ఓకే అన్న థియేటర్స్ కే డిస్నీ వాళ్ళు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. షేర్ పెర్సేంటేజ్ మిగిలిన డబ్ మూవీస్ తో పోల్చితే చాలా తక్కువే అయినా అవతార్ సినిమా సీక్వెల్ కాబట్టి జనాలు కచ్చితంగా థియేటర్స్ కి వస్తారన్న నమ్మకంతో కొందరు ఈ డీల్ కి ఓకే చెబుతున్నారట. మిగిలిన థియేటర్స్ ఒకటి రెండు రోజుల్లో డీల్ ఫైనల్ చేసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here