బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో అల్లరి నరేష్(Allari Naresh) కూడా ఒకరు…కెరీర్ లో ఒకప్పుడు కామెడీ సినిమాలతో రచ్చ చేసిన అల్లరోడు తర్వాత హిట్స్ కి కంప్లీట్ గా దూరం అవ్వగా…ఇప్పుడు డిఫెరెంట్ జానర్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. లేటెస్ట్ గా అల్లరి నరేష్ నటించిన…
ఊరమాస్ రగ్గుడ్ మూవీ అయిన బచ్చల మల్లి(Bachhala Malli Movie) సినిమాతో తన లక్ ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా…ట్రైలర్ ఆకట్టుకోవడం, అల్లరి నరేష్ మాస్ లుక్ పర్వాలేదు అనిపించేలా ఉండటంతో కంటెంట్ బాగుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…
వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ..ఇక సినిమా బిజినెస్ పరంగా ఓవరాల్ గా మంచి రేటునే సొంతం చేసుకుంది అని చెప్పాలి…నైజాంలో ఆల్ మోస్ట్ 1.4 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సీడెడ్ లో 60 లక్షల రేంజ్ లో బిజినెస్ ను ఆంధ్రలో 2.2 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను…
సినిమా సొంతం చేసుకుందని ట్రేడ్ అంచనా…తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా 4.2 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలిపి మరో 80 లక్షల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు అంచనా…. దాంతో సినిమా ఇప్పుడు..
టోటల్ వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో అల్లరి నరేష్ మూవీస్ లో మంచి బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే…
ఆల్ మోస్ట్ 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది…ఎంతవరకు బిజినెస్ ను అందుకో గలుగుతుందో చూడాలి ఇప్పుడు….