Home న్యూస్ రవితేజతో పోటికి దిగుతున్న కిరణ్ అబ్బవరం…ఏమవుతుందో ఇక!!

రవితేజతో పోటికి దిగుతున్న కిరణ్ అబ్బవరం…ఏమవుతుందో ఇక!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర క్రాక్ తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ ను ఫేస్ చేసిన రవితేజ ఇప్పుడు ధమాకా అలాగే వాల్తేరు వీరయ్యలో స్పెషల్ రోల్ తో సెన్సేషనల్ కంబ్యాక్ తో పాటు తన క్రేజ్ ని మరింతగా పెంచుకున్నాడు… దాంతో రవితేజ అప్ కమింగ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇప్పుడు రవితేజ సినిమా పైనే పోటికి…

Dhamaka Total WW Collections!

సిద్ధం అయ్యాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రవితేజ లేటెస్ట్ మూవీ రావణాసుర ఆడియన్స్ ముందుకు ఏప్రిల్ 7న గ్రాండ్ గా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుండగా ఇప్పుడే బాక్స్ ఆఫీస్ దగ్గర వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చిన…

కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా మీటర్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తూ ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. సినిమా ఆడియన్స్ ముందుకు ఏప్రిల్ 7నే రిలీజ్ కానుందని అనౌన్స్ మెంట్ ఇవ్వడంతో అదే రోజు రవితేజ…

రావణాసుర రిలీజ్ అవుతూ ఉండటంతో ఇప్పుడే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టిన కిరణ్ కి ఫామ్ లో ఉన్న రవితేజని తట్టుకోవడం కష్టమే అవుతుందని చెప్పొచ్చు, సమ్మర్ కాబట్టి టాక్ రెండు సినిమాలకు పాజిటివ్ గా ఉంటే కిరణ్ మూవీ సేఫ్ అవ్వొచ్చు కానీ కొంచం తేడా కొట్టినా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here