Home న్యూస్ 2 రోజుల్లో బాలయ్య నట విశ్వరూపం సాంపిల్!

2 రోజుల్లో బాలయ్య నట విశ్వరూపం సాంపిల్!

0

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగి పోతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సినిమా పై ఉన్న అంచనాలను మరింతగా పెంచేస్తుండగా ఇప్పుడు సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కి డేట్ అండ్ టైం ని ఫిక్స్ చేశారు. ఈ నెల 21 న సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించ బోతున్న విషయం తెలిసిందే.

అదే ఈవెంట్ లో సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కానుండగా ఆ ట్రైలర్ లో బాలయ్య స్వర్గీయ ఎన్టీఆర్ గా నట విశ్వరూపం చూపబోతున్నట్లు సమాచారం. ముందుగా టీసర్ రిలీజ్ చేసి తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయాలి అనుకున్నా ఇప్పుడు డైరెక్ట్ గా…

ట్రైలర్ నే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండటంతో అందరి లోను ఆసక్తి మరింతగా పెరిగి పోయింది. సీనియర్ ఎన్టీఆర్ గా పలు గెటప్స్ లో బాలయ్య అచ్చూ ఎన్టీఆర్ ని మరిపించేలా మెప్పించిన ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపం చూడబోతున్నారని, ఆ విశ్వరూపం లో చిన్న సాంపిల్ ని ట్రైలర్ లో చూపబోతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here