Home TRP రేటింగ్ బాక్స్ ఆఫీస్ డిసాస్టర్….2వ సారి కన్నా 3వ సారి ఎక్కువ TRP

బాక్స్ ఆఫీస్ డిసాస్టర్….2వ సారి కన్నా 3వ సారి ఎక్కువ TRP

0

నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో జై సింహా హిట్ తర్వాత చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన విషయం తెలిసిందే, ఎన్టీఆర్ బయోపిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలవగా… తర్వాత తనకి జై సింహా తో హిట్ ఇచ్చిన కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో చేసిన రూలర్ సినిమా కమర్షియల్ మూవీ నే అయినా కానీ భారీ డిసాస్టర్ అయ్యింది.

కాగా ఈ సినిమా వెండి తెరపై నే కాకుండా బుల్లి తెరపై కూడా ఫ్లాఫ్ రిజల్ట్ నే తొలిసారి సొంతం చేసుకోగా రెండో సారి కూడా ఏమాత్రం ఆశించిన మేర TRP రేటింగ్ ను సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా మూడో సారి రీసెంట్ గా టెలికాస్ట్ అయింది.

కాగా మూడో సారి మాత్రం రెండో సారి కన్నా బెటర్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. మొత్తం మీద సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 7.5 TRP రేటింగ్ ని సొంతం చేసుకోగా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు 4.3 TRP రేటింగ్ ని….

మాత్రమె సాధించగలిగింది… ఇక రీసెంట్ గా మూడో సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి 4.91 TRP రేటింగ్ దక్కడం విశేషం. ఓవరాల్ మూడు సార్లు టెలికాస్ట్ అయినప్పుడు సినిమా TRP రేటింగ్ ను గమనిస్తే… లాంగ్ రన్ లో సినిమా TRP రేటింగ్ పరంగా బుల్లి తెరపై హోల్డ్ చేసేలానే కనిపిస్తుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఇక బాలయ్య రూలర్ డిసాస్టర్ రిజల్ట్ తర్వాత తన అప్ కమింగ్ మూవీ తనకి సింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. మోనార్క్ అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here