నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరూ రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకోగా… బాలయ్య అయితే రీసెంట్ గా చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ తో ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే బిగ్గెస్ట్ లాస్ మూవీస్ లో చోటు దక్కించుకున్నాడు. ఇక బోయపాటి శ్రీను కూడా వినయ విధేయ రామ తో అంచనాలు భారీగా తప్పాడు.
కానీ వీళ్ళ కాంబినేషన్ పై మాత్రం ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. బాలయ్య బోయపాటి ల కాంబినేషన్ లో సింహా మరియు లెజెండ్ సినిమా లు ఒకటికి మించి మరోటి భారీ విజయాలను బాక్స్ ఆఫీస్ బరిలో నమోదు చేశాయి.
అవి కూడా బాలయ్య హిట్ ఎట్టి పరిస్థితులలో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉన్న టైం. ఇప్పుడు మళ్ళీ అలాంటి అవసరమే బాలయ్య కి వచ్చింది. హాట్రిక్ ఫ్లాఫ్స్ తర్వాత బాలయ్య చేస్తున్న న్యూ మూవీ టీసర్ గ్లిమ్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా అంచనాలు కూడా భారీగా పెరిగి పోయాయి.
ఇలాంటి టైం లో సినిమా టైటిల్ ఏది పెట్టాలి అని టీం ఆలోచనలో ఉండగా ఇది వరకే అనుకున్న “మోనార్క్” టైటిల్ నే పెట్టాలని ఆల్ మోస్ట్ డిసైడ్ అయ్యారట టీం. సింహా లెజెండ్ అంత పవర్ ఫుల్ గా లేకున్నా కానీ మోనార్క్ బాలయ్య కి పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యే టైటిల్ అని అదే కన్ఫాం చేయాలని టీం భావిస్తుందట.
దాంతో ఇక టైటిల్ లో మార్పులు ఉండే అవకాశం లేనట్టే అని అంటున్నారు. త్వరలోనే వచ్చే ఫెస్టివల్స్ లో సినిమా టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇక సినిమా ఈ ఏడాది లేనట్లే నని వచ్చే ఏడాది సమ్మర్ టైం కి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.