Home గాసిప్స్ సెన్సేషనల్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న బాలయ్య!!

సెన్సేషనల్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న బాలయ్య!!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ కి ఫ్లాఫ్స్ ఎన్ని పడ్డా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన సినిమా పడితే సాలిడ్ కంబ్యాక్ దక్కడం పెద్ద కష్టమేమి కాదు, ఇది వరకు కూడా వరుస ఫ్లాఫ్స్ పడ్డ టైం లో సింహా, లెజెండ్ లాంటి సినిమాల తో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు బాలయ్య. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరమే వచ్చింది అని చెప్పాలి. రీసెంట్ టైం లో…

ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్, రూలర్ సినిమాలతో బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న సినిమా తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు, ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య మూవీ ఏంటి అనేది…

ఇంకా కన్ఫాం కాలేదు కానీ లైనప్ లో ఒకరిద్దరు డైరెక్టర్స్ ఉండగా… వారి లో ఇప్పుడు ఓ క్రేజీ యంగ్ డైరెక్టర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది, టాలీవుడ్ లో రీసెంట్ టైం లో కమర్షియల్ ఎలిమెంట్స్ లో అల్టిమేట్ కామెడీ తో మెప్పించిన అనిల్ రావిపూడి తో బాలయ్య సినిమా ఉండబోతుందని టాక్.

బాలయ్య ఫ్యాన్ అయిన అనిల్ రావిపూడి బాలయ్య కోసం సాలిడ్ కథ ని ఎప్పుడో రాసుకున్నాడట… ఈ విషయాన్నీ బాలయ్య తో ఫోన్ కాల్ లో మాట్లాడాడని సమాచారం. ఆ కథ కి బాలయ్య కూడా బాగుందని చెప్పినట్లు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. దాంతో అన్నీ అనుకుంటే వీరి కాంబినేషన్ లో త్వరలోనే సినిమా వచ్చే చాన్స్ ఉందని సమాచారం.

అనిల్ రావిపూడి ప్రస్తుతం సినిమా ఏదని కన్ఫాం చేయకున్నా ఎఫ్ 3 ఉండవచ్చని టాక్ ఉంది, కానీ ఇంకా కన్ఫాం కాలేదు. మరి బోయపాటి బాలయ్య తో సినిమా త్వరగా ముగిస్తే అనిల్ రావిపూడి సినిమా త్వరగా మొదలు అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు కానీ దీనిపై ఇంకా కన్ఫామేషన్ రావాల్సి ఉంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here