సైడ్ ఆర్టిస్ట్ గా, అప్పుడప్పుడు కమెడియన్ గా టాలీవుడ్ లో అడపా దడపా సినిమా లు చేసిన బండ్ల గణేష్ సడెన్ గా తీన్ మార్ సినిమా తో ప్రొడ్యూసర్ అయిపోయాడు, ఆ సినిమా ఫ్లాఫ్ అవ్వడం తో తిరిగి పవర్ స్టార్ ఆఫర్ తో గబ్బర్ సింగ్ ని నిర్మించి కొంత కాలం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు, కానీ అలాంటి గబ్బర్ సింగ్ ని హిట్ చేసిన…
డైరెక్షన్ హరీష్ శంకర్ కి బండ్ల గణేష్ కి మధ్య ఏవో మిస్ అండర్ స్టాండింగ్స్ తర్వాత ఏర్పడగా అవన్నీ ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. రీసెంట్ గా గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి 8 ఏళ్ళు అవ్వడం సోషల్ మీడియా లో పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ ఎత్తున ట్రెండ్ చేయగా…
డైరెక్టర్ హరీష్ శంకర్ అందరికీ థాంక్స్ చెప్పి నిర్మాత ని మాత్రం పట్టించుకోలేదు, ఇక బండ్ల గణేష్ లేటెస్ట్ గా టాలీవుడ్ వెబ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లో ఈ విషయం పై కొద్దిగా హార్ష్ గానే రియాక్ట్ అయ్యారని చెప్పొచ్చు.
బండ్ల గణేష్ మాటల్లో “అది ఆయనకున్న సంస్కారం. అంతకన్నా ఏం చెప్పలేను. అసలు ఆయన రీమేక్ లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి..ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే డైరక్టర్ కు పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కల్పించింది నేను.
తనకి సినిమాలు లేక కిందా మీదా అవుతుంటే పరిచయం కల్పించింది నేను. ఎన్టీఆర్ తో సినిమా ఇప్పిస్తాన్న వేరే నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసాను నేను. ఫామ్ హవుస్ లో వుంటే తీసుకెళ్లి మిరపకాయ్ కథ వినిపించాను. అది కుదరక పొతే తర్వాత గబ్బర్ సింగ్ కి తీసుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. ఇక దీని పై హరీష్ శంకర్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఆసక్తిగా మారింది…