Home న్యూస్ బందోబస్త్ టోటల్ థియేటర్స్….షాకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్!!

బందోబస్త్ టోటల్ థియేటర్స్….షాకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్!!

0

     తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న తమిళ్ హీరోలలో సూర్య కూడా ఒకరు, కానీ రీసెంట్ టైం లో సూర్య సినిమాలు అన్నీ అంచనాలను తప్పుతుండటం తో క్రేజ్ కూడా తగ్గుతూ వస్తుంది, ఇలాంటి టైం లో రీసెంట్ గా NGK తో భారీ డిసాస్టర్ కొట్టడం తో ఆ ఇంపాక్ట్ లేటెస్ట్ మూవీ బందోబస్త్ పై పడ్డా కానీ ఈ సినిమా టోటల్ గా 44.5 కోట్ల బిజినెస్ ని తమిళ్ లో 9 కోట్ల బిజినెస్ తెలుగు లో సాధించింది.

ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ డే ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ఇలా ఉంది.

?Nizam – 175
?Ceeded – 120
?Andhra – 180
?AP-TG – 475
?Tamil – 550+
?Ka & ROI –190
?OS – 220
?Total WW – 1435
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1435 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 475 థియేటర్స్ ని ఫైనల్ గా సొంతం చేసుకుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే…

అటు తమిళ్ లో ఇటు తెలుగు లో బుకింగ్స్ 3 నాలుగు రోజుల ముందే ఓపెన్ అయినా కానీ ఏమాత్రం ఆశాజనకంగా బుకింగ్స్ లేవనే చెప్పాలి. తమిళ్ సంగతి పక్కకు పెడితే తెలుగు లో సినిమా పరిస్థితి చూసి సూర్య ఇతర సినిమాలను కంపేర్ చేస్తే షాకింగ్ బుకింగ్స్ లా అనిపిస్తున్నాయి.

అయినా కానీ సూర్య కే వి ఆనంద్ ల కాంబో కి మంచి క్రేజ్ ఉండటం తో టాక్ బాగుంటే షో షోకి కలెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉండటం తో తొలిరోజు సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకునే చాన్స్ ఉంది. పోటి లో ఉన్న వాల్మీకి టాక్ ని బట్టి ఈ కలెక్షన్స్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here