Home న్యూస్ బీస్ట్ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

బీస్ట్ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా ముందుగా సినిమా ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకోగా మొదటి టాక్ కూడా వచ్చేసింది. ఆ టాక్ ని గమనిస్తే… స్టొరీ ని పూర్తిగా రివీల్ చేయక పోయినా కానీ టెర్రరిస్ట్ గ్రూప్ హెడ్ ని విడిపించడానికి చెన్నై లోని ఓ మాల్ ని హైజాక్ చేస్తారు…

కానీ ఆ మాల్ లో ఉన్న హీరో ఏం చేశాడు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన బీస్ట్ మూవీ కథ పరంగా పెద్దగా చాలా సింపుల్ కథ తో తెరకేక్కినా కానీ హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో అల్టిమేట్ బ్యాగ్రౌండ్ స్కోర్ మేజర్ హైలెట్స్ గా నిలిచిన బీస్ట్ మూవీ….

ఫస్టాఫ్ కథ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టినా తర్వాత ప్రీ ఇంటర్వెల్ నుండి జోరు అందుకునే సినిమా సాలిడ్ ఇంటర్వెల్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా సెకెండ్ ఆఫ్ లో కొంచం పడుతూ లేస్తూ సాగినా కానీ యాక్షన్ సీన్స్, హీరోయిజం ఎలివేట్ సీన్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో…

సినిమా ఆకట్టుకునేలా సాగుతుందని క్లైమాక్స్ కొంచం అంచనాలను తగ్గట్లుగానే సాగుతుందని అంటున్నారు. మొత్తం మీద సినిమా కథ బలంగా లేక పోయినా కానీ చాలా వరకు సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలానే ఉన్నాయని చెబుతున్నా మొత్తం మీద కథ పరంగా మరీ కొత్తదనం లేక పోవడంతో సినిమా యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో అనిపించింది అంటున్నారు…

విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ లో ఏవి కూడా సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోక పోయినా కానీ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపగా ఇప్పుడు బీస్ట్ సినిమా కూడా ఇదే రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద ప్రీమియర్స్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here