కెరీర్ మొదలు పెట్టడం 2014 లో అల్లుడు శీను సినిమా తో మొదలు పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి హిట్ కొట్టడానికి 5 ఏళ్ల టైం పట్టింది, 2019 లో రాక్షసుడు సినిమా తో తెలుగు లో తొలి హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు వరుస పెట్టి ఇతర సినిమాలు చేస్తూ ఉన్నా కానీ వాటితో తన మార్కెట్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అన్నది మాత్రం చెప్పలేం అనే చెప్పాలి.
కానీ ఇదే టైం లో ఇప్పుడు ఓ భారీ సినిమా పై చర్చలు జరగగా ఆ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది, ముందు కేవలం ఇది రూమర్ మాత్రమే అని అంతా అనుకున్నారు కానీ ఇది రూమర్ అని బెల్లంకొండ సైడ్ నుండి ఎలాంటి…
వార్తలు రాకపోవడం తో ఇది నిజమే అని అంతా అనుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటీ అంటే బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు మూవీస్ హిందీ లో డబ్ అయ్యి యూట్యూబ్ లో సెన్సేషనల్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే, దాంతో ఇప్పుడు బెల్లంకొండతో ఓ రీమేక్ ని…
హిందీలో భారీ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు… ఆ భారీ మూవీ మరేదో కాదు తెలుగులో ప్రభాస్ కి మరింత స్టార్ స్టేటస్ తీసుకు వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారని అంటున్నారు. బాలీవుడ్ భారీ ప్రొడక్షన్ హౌస్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వబోతుంది అని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా…
సారా అలీ ఖాన్ మరియు అనన్య పాండే నటిస్తున్నారని వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉన్నప్పటికీ ఇది కనుక నిజం అయితే కనుక బెల్లంకొండ కి బిగ్గెస్ట్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అని చెప్పాలి. త్వరలోనే దీనిపై ఎదో ఒక అనౌన్స్ మెంట్ వస్తుందని అంటూ ఉండటం తో టాలీవుడ్ ఆ వార్తా కోసం ఎదురు చూస్తున్నారు.