బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో హీరోగా చేసిన సినిమాల్లో మొదటి విజయం 5 ఏళ్ళకి దక్కినా కానీ హిందీ డబ్బింగ్ మూవీస్ తో అక్కడ సెన్సేషనల్ రికార్డులను సొంతం చేసుకుంటూనే ఉన్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక్కడ నిరాశ పరిచినా లేదా కాస్ట్ ఫేల్యూర్ అయిన సినిమాలు చాలా వరకు హిందీ లో డబ్ అయ్యి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. అవి అక్కడ సెన్సేషనల్ వ్యూస్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి.
ఒకటి తర్వాత ఒకటి అక్కడ వరుస సినిమాలు డబ్ అయి అప్లోడ్ అయినా కానీ ఓవరాల్ గా ఇప్పుడు మూడు సినిమాలు 100 మిలియన్స్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపాయి… ఇక్కడ విశేషం ఏంటి అంటే ఆ మూడింట్లో రెండు సినిమాలు ఏకంగా….
200 మిలియన్ మార్క్ ని కూడా క్రాస్ చేసి దుమ్ము లేపాయి… ఇందులో కూడా ఒక సినిమా ఇప్పుడు 300 మిలియన్ మార్క్ వైపు దూసుకు పోతుంది. ప్రస్తుతం హిందీ డబ్బింగ్ మూవీస్ లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది ఈ సినిమా. అల్లు అర్జున్ సరైనోడు, దువ్వాడ జగన్నాథం సినిమాలు…
యూట్యూబ్ లో అనుకోని కారణాల వల్ల డిలేట్ అవ్వకుండా ఉంటె ఈ పాటికే ఈ రికార్డులను ఎప్పుడో దాటేసేవి కానీ ఇప్పుడు ఈ మార్క్ ని అందుకోవడానికి జయ జానకి నాయక దూసుకు పోతుంది. ఆల్ మోస్ట్ 289 మిలియన్స్ రేంజ్ వ్యూస్ ని అందుకుంది ఈ సినిమా. ఇక ఇక్కడ డిసాస్టర్ అయిన కవచం సినిమా అక్కడ ఏకంగా..
200 మిలియన్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా, రీసెంట్ గా అల్లుడుశీను హిందీ డబ్బింగ్ మూవీ 100 మిలియన్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని బెల్లంకొండ ఖాతాలో మూడో 100 మిలియన్ మూవీ గా నిలిచింది. ఓవరాల్ గా మన తెలుగు మూవీస్ హిందీ లో డబ్ అయ్యి అల్టిమేట్ రెస్పాన్స్ తో దూసుకు పోతుండటం విశేషం అనే చెప్పాలి…