Home TRP రేటింగ్ ఫస్ట్ టైం కన్నా సెకెండ్ టైం హైయెస్ట్ TRP….విజయ్ ఊరమాస్!

ఫస్ట్ టైం కన్నా సెకెండ్ టైం హైయెస్ట్ TRP….విజయ్ ఊరమాస్!

0

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ కెరీర్ లో ఇప్పుడు ఆల్ టైం పీక్ స్టేజ్ లో ఉన్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ మూడు సినిమాలు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవగా లాస్ట్ మూవీ బిగిల్ అయితే అన్ని రికార్డుల బెండు తీసి సంచలనాలు సృష్టించింది, ట్రేడ్ లెక్కల్లో ఆల్ మోస్ట్ 300 కోట్ల రేంజ్ గ్రాస్ ని… 152 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుని చుక్కలు చూయించింది…

తెలుగు లో కూడా విజయ్ కెరీర్ బెస్ట్ మూవీ గా నిలిచిన ఈ సినిమా బుల్లితెర పై కూడా సెన్సేషనల్ TRP రేటింగ్స్ తో దుమ్ము లేపడం విశేషం. తెలుగు లో కూడా టెలికాస్ట్ చేసిన ప్రతీ సారి మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా..

తమిళ్ లో మొదటి సారి టెలికాస్ట్ చేసినప్పుడే సాలిడ్ రేటింగ్స్ ని అందుకుని దుమ్ము లేపగా రెండో సారి రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యి మొదటి సారి కన్నా కూడా ఎక్కువ రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసే రికార్డ్ ను నమోదు చేసింది….

సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ చేసినప్పుడు 1 కోటి 64 లక్షల 73 వేల ఇంప్రెషన్స్ దక్కగా… రీసెంట్ గా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా మొదటి సారి కన్నా ఎక్కువగా 1 కోటి 69 లక్షల 36 వేల ఇంప్రెషన్స్ దక్కాయి… సింపుల్ గా టాలీవుడ్ సినిమాల మాదిరిగా TRP లెక్కల్లో చెప్పాలి అంటే… ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఆల్ మోస్ట్….

22.4 రేంజ్ లో రేటింగ్ దక్కగా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా 23.1 రేంజ్ లో రేటింగ్ దక్కింది. మొదటి సారే రికార్డ్ అనుకుంటే రెండో సారి మొదటి సారికి మించి రికార్డ్ కొట్టడం విశేషం. అటు బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా ఇలా బుల్లితెర పై కూడా ఈ సినిమా ఈ రేంజ్ లో విజయం సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here