తన బాలీవుడ్ ఎంట్రీ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్, బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ ని 2014 లో అల్లుడు శీను సినిమాతో మొదలు పెట్టిన బెల్లంకొండ, మొదటి క్లీన్ హిట్ కొట్టడానికి చాలా టైం పట్టింది, అది కూడా రీమేక్ సినిమా అయిన రాక్షసుడు తో 2019 లో స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా లాంగ్ రన్ వలన సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని…
హిట్ గీత దాటగా తర్వాత ఇప్పుడు అల్లుడు అదుర్స్ సినిమాను కంప్లీట్ చేసిన బెల్లంకొండ తన కొత్త సినిమాను ఏకంగా బాలీవుడ్ లో ప్లాన్ చేయగా వినాయక్ డైరెక్షన్ లో ప్రభాస్ కి మరింత క్రేజ్ తెచ్చిన ఛత్రపతి సినిమాను ఇప్పుడు హిందీ లో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్…
కాగా హిందీ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటూ అక్కడ ట్రేడ్ వర్గాలు ఆల్ రెడీ బెల్లంకొండతో చిట్ చాట్ చేస్తుండగా తన కాన్ఫిడెంట్స్ ని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ. తన సినిమాలు రిజల్ట్ కి అతీతంగా హిందీ లో… భారీ వ్యూస్ ని సాధించాయని…
కొన్ని ఏకంగా 200 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని కంటిన్యుగా సొంతం చేసుకోవడంతో తనకి ఈ ఆఫర్ దక్కింది అంటూ చెప్పుకొచ్చిన బెల్లంకొండ, డబ్బింగ్ మూవీస్ కే ఇలా ఉంటె డైరెక్ట్ మూవీస్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది అన్న నమ్మకంతూ ఈ సినిమా తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని భావించానని, టీం కూడా బాగా సెట్ అయ్యిందని…
ఈ సినిమా తో బాలీవుడ్ లో మంచి స్టార్ట్ తనకి లభిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు బెల్లంకొండ. మొత్తం మీద బెల్లంకొండ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండటం తో ఈ సినిమాతో బాలీవుడ్ లో మంచి స్టార్ట్ తనకి లభించే అవకాశం ఎంతైనా ఉందని అంతా అనుకుంటున్నారు ఇప్పుడు..