ప్రతీ ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కానీ హిట్ కౌంట్ కానీ మన కంటే ఎక్కువే… కానీ గత కొంతకాలంగా మనమే ఎక్కువ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నాం కానీ అప్పుడప్పుడు హిట్స్ విషయం లో కొంచం అటూ ఇటూ అవుతున్నాం. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో 28 నుండి 30 సినిమాల వరకు హిట్ అవ్వగా టాలీవుడ్ లో 25 సినిమాలు హిట్ గీత దాటి దుమ్ము లేపే రేంజ్ కాంపిటీషన్ ఇచ్చాయి.
ఇక ఈ ఇయర్ చూసుకుంటే బాలీవుడ్ తో పోల్చితే టాలీవుడ్ లాక్ డౌన్ ముందు వరకు ఉన్న పొజిషన్ చూసుకుంటే నాలుగు స్ట్రైట్ హిట్స్ తో సాలిడ్ గా హోల్డ్ చేసి ఇండియా లో ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ ని సొంతం చేసుకున్న ఇండస్ట్రీ గా నిలిచింది.
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే మొత్తం మీద నోటెబుల్ మూవీస్ 13 వరకు రిలీజ్ అవ్వగా అందులో ఒక్కటి మాత్రమె బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఆ సినిమానే అజయ్ దేవగన్ 100 వ సినిమా అయిన తానాజీ ది అన్ సంగ్ వారియర్ సినిమా.
ఈ సినిమా టోటల్ రన్ లో 280 కోట్ల లోపు షేర్ ని వసూల్ చేయగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది, ఇక మిగిలిన సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ దరిదాపుల్లోకి రాలేక పోయింది, ఇక ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత కూడా పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేక పోతున్నారు. దాంతో ఈ సినిమానే ఈ ఇయర్ టాపర్ గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
కొన్ని క్రేజీ మూవీస్ ఉన్నప్పటికీ లాక్ డౌన్ వలన షూటింగ్ ఆగిపోవడం తో వచ్చే ఇయర్ కి వచ్చే అవకాశం ఉంది, ఇతర సినిమాలకు లాక్ డౌన్ తర్వాత కూడా ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది కాబట్టి మనకన్నా పెద్ద మార్కెట్ అయిన బాలీవుడ్ కి ఈ ఇయర్ సాలిడ్ దెబ్బ పడినట్లే అని అంటున్నారు.