నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. బాక్ టు బాక్ అఖండ(Akhanda Movie) మరియు వీర సింహా రెడ్డి(Veera Simha Reddy Movie) లు బాలయ్య కెరీర్ లో…
భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాయి. ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు వరుస హిట్స్ తో దూసుకు పోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో…
భారీ లెవల్ లో చేస్తున్న కొత్త సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari Movie Budget Details) ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా బడ్జెట్ గురించిన న్యూస్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతూ ఉండగా…
ఆ లెక్క ప్రకారం సినిమా బడ్జెట్ ఆల్ మోస్ట్ 90 కోట్ల నుండి 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందుతుందని సమాచారం. బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము లేపుతున్న బాలయ్య మూవీకి ఈ రేంజ్ బడ్జెట్ పెట్టడం విశేషం కాగా అలాగే సినిమా కి…
నాన్ థియేట్రికల్ బిజినెస్ అలాగే థియేట్రికల్ బిజినెస్ లు ఎక్స్ లెంట్ గా జరుగుతూ ఉండటంతో మేకర్స్ కి సినిమా సాలిడ్ ప్రాఫిట్ ను ఇస్తుందని అంటున్నారు. సినిమా మీద ఉన్న అంచనాల దృశ్యా ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది.