బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల ఎండ్ లో రిలీజ్ కి సిద్ధం అయిన బాలీవుడ్ మూవీ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Kii Prem Kahaani) సినిమా…రణ్ జోహార్(Karan Johar) చాలా గ్యాప్ తర్వాత తన డైరెక్షన్ లో రణవీర్ సింగ్(Ranveer Singh) ఆలియా భట్(Alia Bhatt) ల కాంబినేషన్ లో…
ఫ్యామిలీ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ లో తెరకెక్కిన సినిమాగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఏకంగా 180 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ను పెట్టి సినిమాను నిర్మించారు. ఓ ఫ్యామిలీ మూవీ కి…
ఈ రేంజ్ బడ్జెట్ ఏంటి అంటూ ఆల్ రెడీ సినిమా మీద సోషల్ మీడియాలో సెటైర్స్ కూడా పడుతూ ఉన్నప్పటికీ కరణ్ జోహార్ ఈ సినిమా ద్వారా ఆల్ రెడీ హ్యుమంగస్ అమౌంట్ ని రిటర్న్ కూడా సొంతం చేసుకోవడం ఇప్పుడు విశేషంగా చెప్పుకోచ్చు…
సినిమా కి డిజిటల్ రైట్స్ కింద 80 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 50 కోట్లు, మ్యూజిక్ రైట్స్ కింద 30 కోట్లు, ఇలా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే ఏకంగా 160 కోట్ల దాకా రికవరీ సొంతం అయ్యిందట. ఈ రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా మేకర్స్ కి…
థియేటర్స్ లో జస్ట్ ఒక 50 కోట్లు అలా వస్తే లాభాలు సొంతం అయినట్లే లెక్క అని చెప్పొచ్చు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రేంజ్ అండ్ రిలీజ్ ను బట్టి మినిమమ్ 150 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే హిట్ గా పరిగణిస్తారు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.