Home న్యూస్ హాయ్ నాన్న రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

హాయ్ నాన్న రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

ఈ ఇయర్ దసరా(Dasara Movie) లాంటి ఊరమాస్ సినిమా తర్వాత కంప్లీట్ గా క్లాస్ సబ్జెక్ట్ అయిన హాయ్ నాన్న(Hi Nanna Movie) తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు నాచురల్ స్టార్ నాని(Nani)…కంప్లీట్ క్లాస్ మూవీ అవ్వడంతో మరీ దసరా రేంజ్ లో బజ్ ను సొంతం చేసుకోకున్నా కూడా నాని క్లాస్ మూవీస్ కి మంచి ఆడియన్స్ ఉండటంతో…

ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే తల్లికి దూరం అయిన కూతురుతో లైఫ్ లీడ్ చేస్తున్న ఫోటో గ్రాఫర్ అయిన హీరో తన తల్లి గురించి తెలుసుకోవాలి అనుకున్న కూతురికి తన స్టోరీ చెబుతాడు, ఈ క్రమంలో వీళ్ళతో హీరోయిన్ మృణాల్ జాయిన్ అయ్యి హీరోతో లవ్ లో పడుతుంది…

ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… చాలా నార్మల్ స్టోరీ పాయింట్ తో వచ్చిన హాయ్ నాన్న స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయినా తర్వాత లవ్ స్టోరీ మాత్రం జస్ట్ ఓకే అనిపించేలా సాగగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు బాగా పికప్ అవుతుంది… దాంతో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరుగుతాయి…

సెకెండ్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ తో నిండిపోయి కొంచం అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా బాగానే ఆకట్టుకుంటుంది, మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఎమోషనల్ సీన్స్ తో ఆడియన్స్ ను ఎమోషన్ కి గురి చేసి ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ తో థియేటర్స్ బయిటికి వచ్చేలా చేస్తుంది….

కానీ ఈ క్రమంలో సినిమా కథ చాలా నెమ్మదిగా సాగుతుంది, అలాగే కథ చాలా బాగం ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉంటుంది. కానీ మిగతా సినిమా ఆడియన్స్ కి ముఖ్యంగా క్లాస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది… నాని మరోసారి తన నాచురల్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు…. తన పెర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపించేలా ఉండగా చిన్న పాప కూడా…

చాలా బాగా నటించి మెప్పించింది, మృణాల్ కూడా తన రోల్ వరకు బాగా ఆకట్టుకుంది, మిగిలిన రోల్స్ పర్వాలేదు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ముందే చెప్పినట్లు ఫస్టాఫ్ లో కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేసినా సెకెండ్ ఆఫ్ బాగుంది, ఇక సినిమాకి సంగీతం మేజర్ ప్లస్ కాగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ కి తగ్గట్లు చాలా బాగా మెప్పించింది…

సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే కొత్త డైరెక్టర్ శౌర్యువ్ ఎంచుకున్న పాయింట్ సింపుల్ గానే ఉన్నా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యేలా సినిమాను బాగా డీల్ చేశాడు…. కొంచం నరేషన్ ని ఫాస్ట్ చేసి ఉంటే బాగుండేది కానీ ఓవరాల్ గా మెప్పించాడు డైరెక్టర్…

సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికే కూడా ఇలాంటి క్లాస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది, రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ కూడా ఈ సినిమా మంచి ఆప్షన్, కానీ మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం సినిమా కొంచం ఓపికతో చూస్తె పర్వాలేదు బాగుంది అనిపించవచ్చు. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here