Home గాసిప్స్ కెరీర్ లో ఫస్ట్ టైం…నాగ చైతన్య ఇప్పటి వరకు చేయని రేర్ ఫీట్!

కెరీర్ లో ఫస్ట్ టైం…నాగ చైతన్య ఇప్పటి వరకు చేయని రేర్ ఫీట్!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మంచి జోష్ మీదున్నాడు… కెరీర్ లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న టైం లో సింపుల్ లవ్ స్టొరీ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని కెరీర్ లో మొట్ట మొదటి 40 కోట్ల సినిమా ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ లవ్ స్టొరీ తో మరోసారి రచ్చ చేయడానికి….

సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా ఎఫెక్ట్ వలన ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అన్నది క్లారిటీ లేకుండా పోయింది. త్వరలోనే మిగిలిన పార్ట్ షూటింగ్ జరిపి పరిస్థితులు సద్దుకున్న వెంటనే థియేటర్స్ లో సందడి చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య…

చేస్తున్న కొత్త సినిమా విక్రం కుమార్ డైరెక్షన్ లో అన్న విషయం అందరికీ తెలిసిందే, విక్రం కుమార్ రీసెంట్ మూవీస్ ట్రాక్ తప్పినా అంతకుముందు చేసిన సినిమాలు తన స్పెషాలిటీ ఏంటో అందరికీ ఇప్పటికీ గుర్తు ఉండే ఉంటుంది. మరో సారి ఆ స్పెషాలిటీని నాగ చైతన్య తో చేస్తున్న సినిమాతో చూపెట్టబోతున్నాడట.

ఈ సినిమా లో నాగ చైతన్య తన కెరీర్ లో ఎప్పుడూ చేయని రేర్ ఫీట్ ని టాలీవుడ్ లో అతికొద్ది మంది హీరోలు మాత్రమె చేసిన ఫీట్ ని చేయబోతున్నాడని టాలీవుడ్ లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ వార్తలు నిజం అయితే నాగచైతన్య ఈ సినిమా లో ఏకంగా ట్రిపుల్ రోల్ లో నటించబోతున్నారని అంటున్నారు.

మనం, 13బి మరియు 24 తరహా ఈ సినిమా పూర్తీ డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అని, కథ దృశ్యా నాగచైతన్య ని ఇందులో మూడు డిఫెరెంట్ రోల్స్ లో విక్రం కుమార్ చూపెట్టబోతున్నారని అంటున్నారు. ఇది నిజం అయ్యి అనుకున్నట్లు వర్కౌట్ అయితే నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డులు ఈ సినిమా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here