బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అయిపొయింది. సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నా కానీ అనుకున్న రేంజ్ లో అయితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేయలేక పోయింది. ఓపెనింగ్స్ నుండే అండర్ పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా మొత్తం మీద ఫస్ట్ వీకెండ్ తర్వాత బాక్స్ అఫీస్ దగ్గర స్లో అవ్వగా…
తర్వాత వీక్ లో కాంతార ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా ఇక తేరుకోలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా దీపావళి వీకెండ్ లో కూడా చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవ్వగా ఇప్పుడు రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అయింది అని చెప్పాలి.
కాగా సినిమాను రాయలసీమ ఏరియాలో అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ చేయగా సినిమా ఓవరాల్ బిజినెస్ వాల్యూ 11.50 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా ఓపెనింగ్స్ బాగున్నా లాంగ్ రన్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది…
ఈ ఏరియాలో టోటల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా 9.62 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తీ చేసుకుంది. ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ లో సినిమా 1.88 కోట్ల దాకా లాస్ అయిందని అంచనా… ఇతర ఏరియాల్లో కూడా సినిమా కి ఇలానే నష్టాలు దక్కాయి.