యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ చక్ర సినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది, సినిమా ట్రైలర్ ను ఎప్పుడో రెండు నెలల క్రితమే రిలీజ్ చేయగా సినిమా కి అప్పటి నుండే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం ఆఫర్లు వస్తూ ఉండగా యూనిట్ బెటర్ ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంది. దానికి కారణం సినిమా కి అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయ్యి ఓవరాల్ గా సినిమా కి….
35 కోట్ల రేంజ్ బడ్జెట్ అవ్వడం తో 45 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్ వస్తే అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్ ని అమ్మాలని భావించారు కానీ అలాంటి ఆఫర్లు ఏవి రాలేదు. ఇక రీసెంట్ గా 32-34 కోట్ల రేంజ్ డీల్ కి మేం సిద్ధం అంటూ అమెజాన్ ప్రైమ్ ఆఫర్ ఇచ్చిందని న్యూస్ వచ్చింది.
కానీ తర్వాత పరిస్థితులు మారాయి… దానికి కారణం విశాల్ నటించిన లాస్ట్ మూవీ యాక్షన్.. ఈ సినిమా నష్టాలను భరించాల్సిందే అంటూ ఆ సినిమా నిర్మాతలు కోర్టులో కేసు వేయగా కోర్టు విశాల్ కి నష్టపరిహారం 8.3 కోట్ల రేటు నిర్మాతలకు ఇవ్వాలని….
తీర్పు కూడా ఇచ్చింది, నెల రోజుల్లో ఇవన్నీ పూర్తీ అవ్వాలని కండీషన్ కూడా పెట్టగా విశాల్ ఇప్పుడు అదే పనిలో ఉండగా ఆ ఎఫెక్ట్ వలన ఇప్పుడు చక్ర మూవీ డిజిటల్ రైట్స్ రేటు ఎఫెక్ట్ పడి రేటు తగ్గింది అంటున్నారు. మొన్న 32 కోట్ల నుండి 34 కోట్ల రేంజ్ రేటు ఆఫర్ చేసిన అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు రేటు తగ్గించి…
31 కోట్ల రేంజ్ లో రేటు ఇవ్వగలం అంటూ చెప్పుకొచ్చారట.. దాంతో ఇప్పుడు ఆ రేటుకే సినిమాని అమ్మాలా లేక బెటర్ రేటు కోసం ఎదురు చూడాలా… ఇవన్నీ కాదు ఇక థియేటర్స్ తెరుస్తున్నారు కదా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేయాలా అన్న డౌట్ లో టీం ఉందని తెలుస్తుంది. త్వరలోనే సినిమా పై అనౌన్స్ మెంట్ రావొచ్చని అంటున్నారు.