టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తో హిస్టారికల్ 104 కోట్ల షేర్ అందుకుని దుమ్ము దుమారం చేయగా తర్వాత ఇప్పుడు సైరా నర సింహా రెడ్డి అంటూ ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున రావడానికి సిద్ధం అవుతున్నాడు. కాగా ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్….
తన అప్ కమింగ్ మూవీ ని ముందు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు అని రీసెంట్ గా వార్తలు వచ్చినా అంతకు ముందే కమిట్ అయిన ప్రాజెక్ట్ ని ముందు చేయబోతున్నామని రీసెంట్ గా అప్ డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ…
డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుండగా ఈ సినిమా స్టొరీ పాయింట్ కూడా సోషల్ మెసేజ్ టచ్ ఉంటూనే కొరటాల మూవీస్ స్టైల్ లో ఊరమాస్ యాక్షన్ సీన్స్ తో నిండిపోతుంది అని టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.
తొలి సినిమా మిర్చి తర్వాత అంతటి మాస్ మూవీ తీయని కొరటాల ఇందులో అద్బుతమైన మాస్ సీన్స్ ని రాసుకున్నాడని, అవి మెగాస్టార్ కి పడితే ఇంపాక్ట్ మరో రేంజ్ లో ఉండటం ఖాయమని అంటున్నారు. సైరా రిలీజ్ అయిన వెంటనే షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమా…
అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020 సంక్రాంతి కే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, మరి ఈ న్యూస్ నిజం అయితే మెగాస్టార్ రాంపేజ్ కి బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం, రికార్డులు బద్దలు అవ్వడం సినిమా చరిత్ర సృష్టించడం ఖాయం అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.