Home న్యూస్ 9 ఏళ్ల తర్వాత వస్తున్న చిరు ఇంద్ర….రికార్డులు పక్కా….కానీ!!

9 ఏళ్ల తర్వాత వస్తున్న చిరు ఇంద్ర….రికార్డులు పక్కా….కానీ!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన సినిమాలలో ఇండస్ట్రీ రికార్డుల దుమ్ము దులిపేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఇంద్ర మూవీ(Indra Movie) ఒకటి… 2002 టైంలో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించిన ఈ సినిమా…

ఇప్పటికీ మెగాస్టార్ కెరీర్ లో లాస్ట్ 20-24 ఏళ్లలో బెస్ట్ కమర్షియల్ మాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, కానీ సినిమా టెలివిజన్ లో లాస్ట్ టైం టెలికాస్ట్ అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది. సినిమా శాటిలైట్ రైట్స్ చాలా టైం గా పెండింగ్ లో ఉండగా అనుకోని కారణాల వలన సినిమా టెలివిజన్ రైట్స్ ఆగిపోయాయి.

చివరి సారిగా సినిమా 2014 టైంలో జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవ్వగా ఆ తర్వాత సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వలేదు, ఎప్పటి నుండో సినిమా టెలికాస్ట్ కోసం సోషల్ మీడియా లో ఆడియన్స్ ఎదురు చూసినా కూడా సినిమా టెలికాస్ట్ కన్ఫాం అవ్వలేదు… ఎట్టకేలకు ఇప్పుడు ఆల్ మోస్ట్ 9 ఏళ్ల తర్వాత…

సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఈ సారి సినిమా టెలివిజన్ రైట్స్ ను జీ తెలుగు వాళ్ళు సొంతం చేసుకోగా ఈ ఆదివారం 17న సాయంత్రం 5:30 నిమిషాలకు టెలికాస్ట్ కాబోతుంది. ఆల్ మోస్ట్ 9 ఏళ్ల తర్వాత టెలికాస్ట్ కాబోతున్న ఈ సినిమా…

టెలివిజన్ మళ్ళీ కొత్త సినిమాల రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అదే టైంలో బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ కూడా ఉండబోతుంది కాబట్టి టి.ఆర్.పి పై కొంత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అయినా కూడా సినిమా ఉన్నంతలో టెలివిజన్ చాలా గ్యాప్ తర్వాత వస్తుంది కాబట్టి కుమ్మేసే అవకాశం అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here