ఒకటి తర్వాత ఒకటి వరుసగా 6 ఫ్లాఫ్స్ ని ఎదురుకున్న మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి పై అంచనాలు భారీ గానే ఉన్నాయి, రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుందని చెప్పొచ్చు. క్లీన్ యు సర్టిఫికేట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ రన్ టైం 2 గంటల 10 నిమిషాలు అని తెలిసింది.
ఇక సెన్సార్ వారి నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా ఫస్టాఫ్ చాలా కామెడీ తో ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంటుందని, సెకెండ్ ఆఫ్ కొద్దిగా స్లో అయినా క్లైమాక్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుందని, రీసెంట్ టైం లో సుప్రీం తర్వాత సాయి ధరం తేజ్ కి ఇదే బెస్ట్ మూవీ…
అని వారు చెబుతున్నారు, సెన్సార్ టాక్ ఈ సారి నిజం అయితే కచ్చితంగా సాయి ధరం తేజ్ కెరీర్ లో తిరిగి మంచి కంబ్యాక్ దక్కుతుందని చెప్పొచ్చు. శుక్రవారం భారీ గా రిలీజ్ కాబోతున్న చిత్రలహరి ప్రేక్షకుల మనసును ఎంతవరకు గెలుచుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.