Home న్యూస్ ఇదేమి షాక్ సామి….9 వ రోజు చిత్రలహరి కన్నా 16 వ రోజు మజిలీ భీభత్సం!!

ఇదేమి షాక్ సామి….9 వ రోజు చిత్రలహరి కన్నా 16 వ రోజు మజిలీ భీభత్సం!!

0

     ఈ వీకెండ్ లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి, రెండూ ఆకట్టుకున్నాయి, ఇక పాత సినిమాల పని అయిపొయింది అనుకున్నారు కానీ సమ్మర్ మొదటి హిట్లు అయిన మజిలీ మరియు చిత్రలహరి ఈ వీక్ లో కూడా జోరు చూపుతున్నాయి. మజిలీ సినిమా మాత్రం మూడో వీక్ లో ఎంటర్ అయినా కానీ సెన్సేషనల్ హోల్డ్ తో కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుండటం విశేషం. సినిమా 15 వ రోజు చిత్రలహరి తో నెక్ టు నెక్…

కలెక్షన్స్ ని సాధించగా 16 వ రోజు మాత్రం 9 వ రోజు లో ఎంటర్ అయిన చిత్రలహరి ని బీట్ చేసి సంచలనం సృష్టించింది, మజిలీ కన్నా ఎక్కువ థియేటర్స్ ఉన్న చిత్రలహరి పోటి లో 9 వ రోజు కొంచం వెనకడుగు వేసింది. మొత్తం మీద మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రూ…

బ్లాక్ బస్టర్ అనిపించుకుంటు కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, ట్రేడ్ లెక్కల్లో మజిలీ 16 వ రోజున మొత్తం మీద రెండు రాష్ట్రాలలో అవలీలగా 60 లక్షలకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉందట, ఇది 15 వ రోజు వసూళ్ళ కన్నా ఎక్కువే అవ్వడం మరో విశేషం.

ఇక చిత్రలహరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు స్లో డౌన్ అయినా డీసెంట్ అనిపించుకునే విధంగా 40 లక్షలకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉందట. దాంతో అంతకుముందు వారం రిలీజ్ అయిన సినిమా కలెక్షన్స్ కన్నా చిత్రలహరి కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి.

మొత్తం మీద రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీత దాటి సమ్మర్ లో టాలీవుడ్ కి వరుసగా రెండు హిట్లు అందించాయి. కానీ మజిలీ మాత్రం స్టిల్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుండటం విశేషం. ఇక రెండు సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎ విధంగా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here