Home న్యూస్ చిత్రలహరి ఫస్ట్ డే కలెక్షన్స్…ఊరమాస్!!

చిత్రలహరి ఫస్ట్ డే కలెక్షన్స్…ఊరమాస్!!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ చిన్నదే, కానీ వరుస ఫ్లాఫ్స్ పడటం తో ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఎదురు చూసిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కి చిత్రలహరి సినిమా గత 6 సినిమాల కన్నా బెటర్ టాక్ ని సొంతం చేసుకోవడం తో ఫ్లాఫుల్లో సినిమా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, తొలి షో వరకు బుకింగ్స్ మందగించినా కానీ మెల్లి మెల్లిగా షో షో కి గ్రోత్ ని అందుకుంటూ దూసుకు పోయింది ఈ సినిమా.

ఫైనల్ గా తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ షో అలాగే మ్యాట్నీ షోల బుకింగ్స్ చూసి సినిమా 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అని భావించగా సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి గ్రోత్ ని సాధించి ఓపెనింగ్స్ ని 45 టు 50% ని టచ్ చేసింది.

దాంతో తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్న లెక్క పెరిగే సూచనలు గట్టిగానే ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి 3.2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ఖాయమని చెప్పొచ్చు, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండి… IPL ఎఫెక్ట్ పడకుండా ఉంటే ఈ లెక్క…

మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంది, తక్కువ లో తక్కువ 3.5 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు, ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్ షోల ద్వారా సినిమా 57 వేల దాకా డాలర్స్ ని అందుకుని మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.

ఇక వరుస ఫ్లాఫుల్లో ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా కలెక్షన్స్ ని అందుకుంటూ మొదటి రోజు దుమ్ము లేపిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 12.5 కోట్ల లో చాలా వరకు మొదటి రోజే రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు, ఇక అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here