మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వీకెండ్ ని పూర్తి చేసుకోగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో మాత్రం కొద్దిగా స్లో డౌన్ అయ్యింది, సినిమా కి మరీ అద్బుతమైన పాజిటివ్ టాక్ రాకున్నా కానీ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో వీకెండ్ లో కుమ్మేసినా వర్కింగ్ డేస్ లో మళ్ళీ అలాంటి జోరు చూపలేక పోయింది ఈ సినిమా…
కానీ సినిమా బిజినెస్ తక్కువ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర అది సినిమాకి హెల్ప్ అయింది, సినిమా 4 వ రోజు కోటి దాకా షేర్ ని 5 వ రోజు 90 లక్షలకు పైగా షేర్ ని అందుకుంది, టోటల్ గా 5 రోజుల్లో రెండు రాష్ట్రాలలో సినిమా 9.87 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక సినిమా…
వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో 12.44 కోట్ల షేర్ ని అందుకుంది, సినిమా ను 12.5 కోట్లకు అమ్మడంతో 13.5 కోట్ల లోపు టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మరో కోటి అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఆ ఒక్క అడుగును మొదటి వారం పూర్తి అయ్యే లోపు అందుకోవడం ఖాయమని చెప్పోచ్చు…