మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన కంబ్యాక్ చేశాడు, యావరేజ్ రివ్యూ లనే సొంతం చేసుకున్న చిత్రలహరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం వసూళ్ళ పరంగా మాత్రం దుమ్ము లేపి క్లీన్ హిట్ జాబితా లో ఎంటర్ అయ్యి సంచలనం సృష్టించింది. సినిమా 7 వ రోజు రెండు రాష్ట్రాలలో 60 లక్షల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.
ఇక మొత్తం మీద మొదటి వారం లో సినిమా రెండు రాష్ట్రాలలో టోటల్ గా 11.21 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించగా సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో 13.94 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 25 కోట్లకు పైగా ఉందని సమాచారం.
సినిమాను టోటల్ గా 12.5 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి, మొదటి వారం ముగిసాక 40 లక్షలకు పైగా లాభంతో క్లీన్ హిట్ గా నిలిచింది, రెండో వారం లో హోల్డ్ చేస్తే సినిమా సూపర్ హిట్ గా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు.