Home న్యూస్ చిత్రలహరి డే 1 ఓపెనింగ్స్…ట్రేడ్ కి షాక్!!

చిత్రలహరి డే 1 ఓపెనింగ్స్…ట్రేడ్ కి షాక్!!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఓవర్సీస్ నుండి ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నా రెగ్యులర్ షోల కి కూడా అదే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకుంది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా కూడా సినిమా మంచి స్టార్ట్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. బుకింగ్స్ కొద్దిగా…

వీక్ గా ఉన్నప్పటికీ సినిమా మొదటి షో సమయానికి టోటల్ గా 40% వరకు ఆన్ లైన్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది, కాగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి, దాంతో 6 ఫ్లాఫ్స్ వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ ఓపెనింగ్స్ ని…

సొంతం చేసుకున్న చిత్రలహరి మూవీ ని చూసి ట్రేడ్ కూడా కొద్దిగా షాక్ అవుతున్నారు, కానీ పోటి లో మజిలీ సూపర్ సాలిడ్ గా దూసుకు పోతుండటం తో ఎంతవరకు చిత్రలహరి సినిమా జోరు రోజు మొత్తం కొనసాగుతుంది అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తి గా మారింది అని చెప్పాలి.

ఉన్నంతలో ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్, ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ సరిగ్గా ఉంటె రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు అవలీలగా సినిమా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు మరింత ఎక్కువగా ఉంటె ఈ లెక్క మరింత పెరుగుతుంది.

వరుస ఫ్లాఫ్స్ లో కూడా ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ అంటే గ్రేట్ అనే చెప్పాలి, పైగా బిజినెస్ కూడా తక్కువే అవ్వడం తో సినిమా తొలిరోజు సాధించే కలెక్షన్స్ తో చాలా వరకు బిజినెస్ ని వెనక్కి తెచ్చే చాన్స్ ఉంది, మరి డే ఎండింగ్ కి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here