Home న్యూస్ చిత్రలహరి ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా ఫట్టా!!

చిత్రలహరి ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా ఫట్టా!!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నేడు రిలీజ్ అయ్యింది, ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ను పూర్తీ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుందాం పదండీ. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే లైఫ్ లో ఏమాత్రం సక్సెస్ లేని హిరో లైఫ్ లో ఇద్దరు అమ్మాయిలు ఎంటర్ అయ్యాక ఎం జరిగింది అన్నది కథ పాయింట్ అంటున్నారు.

కథ పాయింట్ ఎంత మాములుగా ఉందొ సినిమా కూడా అంతే సింపుల్ గా ఉంటుందని, కానీ పార్ట్ పార్టులుగా సినిమా చాలా వరకు ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు, ముఖ్యంగా ఫస్టాఫ్ లో చాలా సీన్స్ అలరించే విధంగా ఉండగా సెకెండ్ ఆఫ్….

కొంచం స్లో అయిన ఫీలింగ్ కలిగినా కానీ సినిమా అయిపోయే టైం కి పర్వాలేదు, మంచి సినిమా నే చూశాం అన్న ఫీలింగ్ తో బయటికి వస్తారని అంటున్నారు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు, సాయి ధరం తేజ్ అలాగే..

హీరోయిన్స్ ఇద్దరు బాగా నటించారని, సునీల్ చాలా కాలానికి బాగా నవ్వించాడని, వెన్నెల కిషోర్ కూడా ఆకట్టుకున్నాడని అంటున్నారు, ఓవరాల్ గా సినిమా లో కొన్ని డ్రా బ్యాక్స్ ఉన్నప్పటికీ సాయి ధరం తేజ్ నటించిన చివరి 6 సినిమాల కన్నా కూడా…

చాలా బెటర్ మూవీ గా చిత్రలహరి మూవీ ఉందని వారు చెబుతున్నారు, ఫైనల్ గా సినిమా ఓవర్శిస్ టాక్ ఎబో యావరేజ్ టు హిట్ కి మధ్యలో ఉందని అంటున్నారు. ఇక రెగ్యులర్ షోల కి ఎలాంటి టాక్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తి గా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here