Home న్యూస్ చిత్రలహరి రివ్యూ-రేటింగ్…ప్లస్ & మైనస్ పాయింట్స్

చిత్రలహరి రివ్యూ-రేటింగ్…ప్లస్ & మైనస్ పాయింట్స్

0

         ఒకటి తర్వాత ఒకటి వరుసగా 6 ఫ్లాఫ్స్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి నేడు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, సినిమా పై ప్రేక్షకుల నెలకొన్న ఆసక్తి మేరకు వరల్డ్ వైడ్ గా 900 వరకు థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయగా ముందుగా ఓవర్సీస్ లో ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఫైనల్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలుసుకుందాం పదండీ.

Chitralahari Advance Bookings Report...Shocking

కథ: జీవితంలో అసలు లక్ లేని విజయ్ కి టాలెంట్ ఉన్నా కలిసి రాదు, అలాంటి లైఫ్ ని లీడ్ చేస్తున్న విజయ్ కి అనుకోకుండా కళ్యాణి తో పరిచయం ప్రేమగా మారగా తన లైఫ్ లో మరో అమ్మాయి నివేద ఎంటర్ అయ్యాక పరిస్థితులు ఎలా మారాయి, అసలు లక్ తన లైఫ్ లో ఎంటర్ అయ్యిందా అన్నది పూర్తిగా థియేటర్స్ కి వెళ్లి తెలుసుకోవాల్సిందే.

కథ వీక్ గా ఉన్నా నటీనటుల పెర్ఫార్మెన్స్ తో నిలబడే సినిమాలు కొన్ని ఉంటాయి, చిత్రలహరి సినిమా ఆ కోవలోకి వచ్చే సినిమానే, సాయి ధరం తేజ్, ఇద్దరు హీరోయిన్స్, సునీల్, వెన్నెల కిషోర్ మరియు పోసానిల అద్బుత నటన తో సినిమా పాస్ మార్కులు దక్కించుకుంది.

సటిల్ద్ పెర్ఫార్మెన్స్ తో హీరో మరియు హీరోయిన్స్ అందరు ఎక్కడ నటన పరంగా హద్దులు దాటకుండా ప్రేక్షకుల మనసు గెలిచే విధంగా నటించి మెప్పించారు, పోసాని రోల్ మాత్రం థియేటర్ బయటికి వచ్చాక కూడా గుర్తుండే విధంగా దర్శకుడు రాసుకున్నాడు.

ఇక సునీల్ చాలా రోజుల తర్వాత కడుపుగ్గా నవ్వించాడు, వెన్నెల కిషోర్ కూడా కొన్ని సీన్స్ లో తన మార్క్ చూపెట్టాడు, హీరోయిన్స్ ఇద్దరు తమ తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు, ఫస్టాఫ్ అంతా అలా అలా ఎంటర్ టైనింగ్ గా సాగగా సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినా బాగానే ముగుస్తుంది.

ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి చాలా ప్లస్ అయ్యాయి, ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది, సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకుంటాయి. కానీ డైరెక్షన్ విషయం లో కిషోర్ తిరుమల మాత్రం.

బలమైన కథ ని చెప్పడం లో విఫలం అయ్యాడు, సింపుల్ స్టొరీ ని చాలా వరకు ఆకట్టుకునేలా చేసినా వీక్ కథ వల్ల సినిమా తేలిపోయింది అనుకునే సమయం లో నటీనటుల పెర్ఫార్మెన్స్ తో సినిమా ఒడ్డుకు చేరుకుందని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయనికి వస్తే…

ప్లస్ పాయింట్స్:
*నటీనటుల పెర్ఫార్మెన్స్
* దేవి సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్
* సునీల్, వెన్నెల కిషోర్ ల కామెడీ
* డైలాగ్స్
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే
*స్టొరీ ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటం
* సెకెండ్ ఆఫ్ స్లో అయిన ఫీలింగ్
* వీక్ డైరెక్షన్
ఇవీ మొత్తం మీద సినిమా లో మేజర్ మైనస్ పాయింట్స్.

సినిమా ఉన్నంతలో ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకసారి చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా, ముఖ్యంగా సాయి ధరం తేజ్ కెరీర్ లో గత 6 సినిమాల కన్నా కూడా చాలా బెటర్ గా ఉండే మూవీ ఇది, కొత్త కథ కావాలి అనుకునే వారికి యావరేజ్ గా ఉన్నా.. రొటీన్ మూవీ గోర్స్ కి మాత్రం…

సినిమా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే సినిమా చిత్రలహరి. ఓవరాల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here