ఆడియన్స్ ముందుకు బాలీవుడ్ నుండి ఇయర్ ఎండ్ లో బిగ్ కమర్షియల్ డైరెక్టర్ గా పేరున్న రోహిత్ శెట్టి డైరెక్షన్ లో రణవీర్ సింగ్ హీరోగా జాక్వెలిన్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ సర్కస్ మూవీ రిలీజ్ అవ్వగా ట్రైలర్ రిలీజ్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన టీం మినిమమ్ ఆసక్తిని కూడా క్రియేట్ చేయలేక పోయింది. కానీ రోహిత్ శెట్టి సినిమా అంటే కచ్చితంగా…
కామెడీ వర్కౌట్ అవుతుంది అనుకుని థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ను ఈ సినిమా ఓ రేంజ్ లో టార్చర్ చేసింది. అతి సాధారమైన కథలో ప్రతీ సీన్ లో ఎలాగైనా కామెడీ పుట్టించాలని యాక్టర్స్ ప్రతీ సీన్ లో ఫోర్స్ గా నటించడంతో ఏ దశలో కూడా సినిమా…
కామెడీని అయితే పుట్టించలేక పోయింది సరికదా అసలు ఈ సినిమాను రోహిత్ శెట్టే తీశాడా అన్నట్లు అనిపించగా ప్రతీ సీన్ లో ఫుల్ ఎనర్జీతో నటించే రణవీర్ సింగ్ నటన కూడా చాలా ఓవర్ గా అనిపించింది సినిమాలో… అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపించినా కానీ ఓవరాల్ గా…
సర్కస్ సినిమా రోహిత్ శెట్టి కెరీర్ లో వీకేస్ట్ మూవీ అని చెప్పాలి. క్వాలిటీ పరంగా ఎక్స్ లెంట్ గా ఉన్నా కానీ ఏ దశలో కూడా మెప్పించలేక పోయిన ఈ సినిమా ఈ ఇయర్ బాలీవుడ్ కి భారీ నిరాశ కలిగించే ఎండింగ్ ని ఇచ్చింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా తీవ్రంగా నిరాశ పరుస్తుండటం విచారకరం…