బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అయిన మార్చ్ లో ఊహకందని కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా, ఆల్ రెడీ ఎక్స్ లెంట్ లాభాలను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా….
లాంగ్ రన్ లో టాలీవుడ్ లో చిన్న సినిమాల పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన సినిమాగా నిలవనుంది. ఈ క్రమంలో సినిమా ఈ ఇయర్ వచ్చిన బిగ్ హిట్ మూవీస్ ని కూడా కొన్ని చోట్ల కలెక్షన్స్ పరంగా దాటేస్తూ ఉండటం విశేషం.
సినిమా లాస్ట్ నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చి మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన నాగ చైతన్య నటించిన తండేల్(Thandel Movie) అమెరికాలో టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ మొత్తాన్ని బ్రేక్ చేసింది…
తండేల్ సినిమా అన్ని చోట్లా కుమ్మేసినా ఓవర్సీస్ లో మాత్రం అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు. అమెరికాలో టోటల్ రన్ లో కేవలం 820K డాలర్స్ మార్క్ ని మాత్రమే దాటిన సినిమా అక్కడ కొంచం నిరాశ పరిచింది. కానీ అదే టైంలో తండేల్ బడ్జెట్ తో…
పోల్చితే చాలా తక్కువ బడ్జెట్ లో రూపొంది పెద్దగా స్టార్ కాస్ట్ గురించి కూడా ఎవ్వరికీ తెలియని కోర్ట్ సినిమా నార్త్ అమెరికాలో ఇప్పుడు తండేల్ ను దాటేసి 9 లక్షల డాలర్స్ మార్క్ ని కూడా క్రాస్ చేసి 1 మిలియన్ మార్క్ దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం…
ఓ చిన్న సినిమా అక్కడ కూడా ఈ రేంజ్ లో వసూళ్ళని అందుకుని మాస్ కుమ్ముడు కుమ్మడం అన్నది మామూలు విషయం కాదు. ఈ నెల ఎండ్ వరకు పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు ఏమి లేక పోవడంతో కోర్ట్ మూవీ మాస్ రాంపెజ్ అలానే కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది.