Home న్యూస్ కోర్ట్ మూవీ రివ్యూ….హిట్టు సినిమా బాస్!!

కోర్ట్ మూవీ రివ్యూ….హిట్టు సినిమా బాస్!!

0

నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అయింది….. ట్రైలర్ రిలీజ్ నుండే సినిమా మీద డీసెంట్ అంచనాలు ఏర్పడగా…ఇక నాని కూడా మాట్లాడుతూ ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 కూడా చూడకండి అంటూ కామెంట్ చేశారు. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే….ఊర్లో చాలా పాపులర్ అయిన శివాజీ కూతురుని తక్కువ కాస్ట్ అబ్బాయి ప్రేమిస్తున్నాడని తెలుసుకుని…అతని మీద ఎన్నో తప్పుడు కేసులు వేస్తారు…దాంతో పాటు ఫోక్సో కేసు కూడా వేస్తారు…దాంతో ఆ అబ్బాయి తప్పించుకోలేక పోతాడు…ఆ అబ్బాయిని కాపాడటానికి సామాన్య లాయర్ అయిన ప్రియదర్శి ఏం చేశాడు…తర్వాత ఏం జరిగింది అన్నది అసలు కథ…

ఒక సీరియస్ కథ పాయింట్ తో వచ్చిన కోర్ట్ మూవీ…కథ బాగా మెప్పించగా…సినిమాలో అందరి యాక్టింగ్ ఒకెత్తు అయితే…చాలా టైం తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన శివాజీ తన నటన స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టేశాడు…తన సీన్స్, డైలాగ్స్ టెర్రిఫిక్ అనిపించాయి… ప్రియదర్శి కానీ సాయి కుమార్ కానీ హర్ష వర్ధన్ కానీ ఎవరి రోల్ లో వాళ్ళు కుమ్మెశారు…

ఇక హీరో హీరోయిన్స్ ఉన్నంతలో బాగా నటించి మెప్పించారు….సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఆకట్టుకుంది…స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ కూడా పెద్దగా బోర్ ఏమి అనిపించకుండా టైట్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నారు….సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా…

ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ యూనిక్ గా ఉండగా..కొన్ని లాజిక్ లు మిస్ అయినా కూడా ఓవరాల్ గా సీరియస్ టోన్ తో సినిమా ని బాగా నడిపించాడు…సినిమాలో కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా పూర్తి అయిన తర్వాత…

ఆడియన్స్ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్స్ బయటికి రావడం ఖాయం…. కానీ కొన్ని డైలాగ్స్ యూత్ కి రాంగ్ మెసేజ్ ఇచ్చేలా ఉండటం లాంటివి మ్యూట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది… ఓవరాల్ గా కోర్ట్ మూవీ నాని చెప్పినట్లు…

అంచనాలను బాగానే అందుకుంది అని చెప్పాలి….దాంతో హిట్3 మూవీ కి ఏమాత్రం ఇబ్బంది ఉండదు అని చెప్పొచ్చు. రోటిన్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్…మంచి టైట్ స్క్రీన్ ప్లే తో నడిచే స్క్రీన్ ప్లే మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి కోర్ట్ మూవీ బాగానే నచ్చే అవకాశం ఉంది…సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here