Home న్యూస్ డార్లింగ్ మూవీ రివ్యూ….వై దిస్ కొలవరీ!!

డార్లింగ్ మూవీ రివ్యూ….వై దిస్ కొలవరీ!!

0
Darling(2024) Movie Review and Rating
Darling(2024) Movie Review and Rating

చిన్న సినిమానే అయినా కూడా ప్రియదర్శి(Priyadarshi) మరియు నభా నటేష్(Nabha Natesh) ల కాంబినేషన్ లో రూపొందిన డార్లింగ్(Darling Movie Review) సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ ను క్రియేట్ చేసింది…ఇక సినిమా కూడా ఇదే రేంజ్ లో మెప్పిస్తుంది అన్న నమ్మకంతో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ..

ముందుగా కథ పాయింట్ కి వస్తే చిన్నప్పటి నుండి బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకుని ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫారన్ వెళ్ళాలి అనుకునే హీరోకి పెళ్లి సెట్ అయినట్లే అయ్యి అమ్మాయి తనని వదిలి పారిపోవడంతో చనిపోవాలి అనుకున్న టైంలో హీరోయిన్ పరిచయం అవుతుంది…తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత హీరోకి…

హీరోయిన్ గురించి ఎలాంటి నిజం తెలిసింది, ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. స్ల్పిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ ఒకప్పుడు బాగా ఊపేసిన కాన్సెప్ట్…ఆ కాన్సెప్ట్ ను అందరూ అరిగిపోదాకా వాడేశారు… కానీ మళ్ళీ అదే పాయింట్ ని తీసుకుని రూపొందిన డార్లింగ్ మూవీ పైన పటారం లోన లొటారం అనిపించింది…

ట్రైలర్ చూసిన తర్వాత మంచి ఎంటర్ టైనర్ అనిపించి థియేటర్స్ కి వెళ్ళిన తర్వాత ప్రియదర్శి అక్కడక్కడా నవ్వులు పంచినా కూడా కామెడీ కోసం సినిమా అంతా వెతుక్కోవడంతోనే సరిపోయింది….ఫస్టాఫ్ ఎలాగోలా ఓపిక పట్టి చూడగా ఇంటర్వెల్ ఎపిసోడ్ కొంచం పర్వాలేదు అనిపించగా…

సెకెండ్ ఆఫ్ కథ ఎటు నుండి ఎటో వెళుతూ సహనానికి పరీక్ష పెట్టేసింది…క్లైమాక్స్ పోర్షన్ సెంటిమెంట్ వర్కౌట్ చేయాలి అనుకున్నారు కానీ అప్పటికీ సినిమా చూస్తున్న ఆడియన్స్ టైటిల్ కాప్షన్ లో పెట్టినట్లు వై దిల్ కొలవరీ అంటూ కూర్చుంటారు…. 

ప్రియదర్శి ఉన్నంతలో బాగానే నటించి మెప్పించగా…ఎందుకో హీరోయిన్ రోల్ కి నభా సెట్ అవ్వలేదు అనిపించింది…వేరే వాళ్ళతో ట్రై చేసి ఉంటే బాగుండేదో…ఇతర రోల్స్ పర్వాలేదు…సంగీతం ఓకే అనిపించగా ఎడిటింగ్ స్క్రీన్ ప్లే పరమ బోర్ కొట్టించాయి..ఈజీగా చాలా రన్ టైంని ట్రిమ్ చేసి ఉండొచ్చు కానీ చేయలేదు…ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి..

డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అరిగిపోయిన కాన్సెప్ట్, ఆ కథని చెప్పిన విధానం మరింత నెమ్మదిగా ఉండటంతో డైరెక్షన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది…. ట్రైలర్ చూసి థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ చాలా చాలా ఓపిక చేసుకుని చూస్తె యావరేజ్ అనిపించే లెవల్ లో ఉంటుంది…..కానీ ముందే చెప్పినట్లు చాలా ఓపిక అవసరం….సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here