బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 మొదటి రోజు టోటల్ గా 107 కోట్ల గ్రాస్ ని వసూల్ చేయగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ మొదటి రోజు తో పోల్చుకుంటే సగం వరకు డ్రాప్స్ వచ్చాయి. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల కు గ్రోత్ వచ్చినా అది అనుకున్న రేంజ్ లో లేదనే చెప్పాలి.
టోటల్ గా సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తెలుగు వర్షన్ సుమారు 5 కోట్ల రేంజ్ లో షేర్ వసూల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తమిళ్ వర్షన్ రెండో రోజు 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక హిందీ వర్షన్ మొదటి రోజు లెవల్ లో ఉందని అంటున్నారు. 18 కోట్ల నుండి 20 కోట్ల మధ్యలో నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు. ఓవరాల్ గా రెండో రోజు గ్రాస్ 50 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది…ఇది అంచనాలకు అందుకోలేదనే చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంచనాలను అందుకుంటే ఈ లెక్క పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.