Home న్యూస్ బాక్స్ అఫీస్ టార్గెట్ 720 కోట్లు…ఇది సరిపోదు…రెచ్చిపోవాలి ఇక!

బాక్స్ అఫీస్ టార్గెట్ 720 కోట్లు…ఇది సరిపోదు…రెచ్చిపోవాలి ఇక!

0

  సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయినా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా 107 కోట్ల గ్రాస్ మార్క్ నే అందుకోగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వేట కూడా అనుకున్న రేంజ్ లో లేక పోయినా సినిమా మెల్లి మెల్లి గా పుంజుకుంటూ వీకెండ్ పై ఆశలు అంచనాలు పెరిగేలా చేస్తుంది.

సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా సుమారు 360 కోట్లకు అమ్మారు, అంటే సినిమా షేర్ ని 362 కోట్ల రేంజ్ లో వసూల్ చేయాల్సి ఉండగా టోటల్ గ్రాస్ 720 కోట్ల రేంజ్ లో ఉంటె బ్రేక్ ఈవెన్ అవుతుంది. మొదటి రెండు రోజుల కలెక్షన్స్ ఇప్పుడు…155 నుండి…

160 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది, కానీ ఈ జోరు సరిపోదనే చెప్పాలి. సినిమా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాగు పాజిటివ్ టాక్ ఉండటం తో పాటు ఎలాంటి పోటి లేక పోవడం తో కచ్చితంగా సినిమా పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here