నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి రెండు రోజులలో సాధించిన కలెక్షన్స్ పూర్తిగా అండర్ పెర్ఫార్మ్ చేయగా టాక్ బాగున్నా ఇలా తక్కువ కలెక్షన్స్ కారణాలు ఏవి తెలియడం లేదు, ఇక మూడో రోజు సినిమా థియేటర్స్ కౌంట్ కూడా భారీ గా తగ్గడం మరింతగా షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఓపెనింగ్స్ రెండో రోజు కన్నా తక్కువగా ఉండగా సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా ఏమాత్రం జోరు అందుకోకపోవడం, థియేటర్స్ చాలా తక్కువ ఉండటం నిజంగానే భారీ ఎఫెక్ట్ చూపింది.
దాంతో మూడో రోజు సినిమా కలెక్షన్స్ 1 కోటి అందుకుంటే అది గొప్ప విషయమే అంటున్నారు, 71.5 కోట్ల టార్గెట్ తో 3 వ రోజు ఇలాంటి కలెక్షన్స్ పాజిటివ్ టాక్ తో ఎవ్వరూ ఊహించని షాక్ అనే చెప్పాలి, కానీ శనివారం నుండి అసలు సిసలు సంక్రాంతి సెలవులు కాబట్టి సినిమా జోరు చూపే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.