మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ ఆడియన్స్ ముందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో 600 వరకు థియేటర్స్ లో అలాగే వరల్డ్ వైడ్ గా 740 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు నాలుగు రోజుల ముందే స్టార్ట్ అయినా కానీ మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయలేక పోయింది. సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ చాలా నాసిరకంగా ఉండటంతో…
ఇక మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమా ను మేకర్స్ పెద్దగా ప్రమోట్ కూడా చేయలేదు, మెగా హీరోలు సినిమాను ప్రమోట్ చేసినా కానీ బుకింగ్స్ రూపంలో అది రిఫ్లెక్ట్ కాలేదు. ఇక రిలీజ్ రోజుకి వచ్చే సరికి టోటల్ గా రిలీజ్ అయిన 600 థియేటర్స్ లో…
ఓవరాల్ ఆక్యుపెన్సీ చూస్తె 15% కి అటూ ఇటూగా ఉందని తెలుస్తుంది, ఆంధ్రలో లో టికెట్ రేట్లు అండ్ 50% ఆక్యుపెన్సీ వలన కొన్ని ఫుల్స్ పడ్డా కానీ ఇటు నైజాం లో అలాగే అటు సీడెడ్ లో మాత్రం ఓపెనింగ్స్ చాలా నార్మల్ గా ఉన్నాయి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు…
మెల్లి మెల్లిగా బుకింగ్స్ పెరుగుతున్నాయి అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా పర్వాలేదు అనిపించేలా ఇంప్రూవ్ మెంట్ ని సొంతం చేసుకుంటున్నాయి కాబట్టి అన్నీ బాగుంటే సినిమా ఇప్పుడు 1.6 కోట్ల నుండి 2 కోట్ల మధ్యలో ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది… అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కంప్లీట్ గా బాగుండి…
ఇంకా గ్రోత్ ని చూపెట్టాల్సిన అవసరం ఉంది, సినిమా బిజినెస్ దృశ్యా చూస్తె ఇవి చాలా సాదాసీదా ఓపెనింగ్స్ అని చెప్పాలి. మరి సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కంప్లీట్ అయ్యే టైం కి సినిమా ఎంత వరకు గ్రోత్ ని సొంతం చేసుకుంటుంది, ఎలాంటి హోల్డ్ ని సాధిస్తుందో చూసి మరోసారి ఎంత వరకు కలెక్షన్స్ ని మొదటి రోజు సాధించే అవకాశం ఉందో అప్ డేట్ చేస్తాం…