Home న్యూస్ “డియర్ కామ్రేడ్” నైజాం బిజినెస్…ఊరమాస్!

“డియర్ కామ్రేడ్” నైజాం బిజినెస్…ఊరమాస్!

0

  సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గీత గోవిందం అల్టిమేట్ హిట్ తర్వాత నోటా తో దెబ్బ తిన్నా తిరిగి టాక్సీవాలా సినిమాతో దుమ్ము లేపే బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని సత్తా చాటాడు. ఇక ఇప్పుడు సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు డియర్ కామ్రేడ్ అంటూ రాబోతుండగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీసర్ కి అన్ని భాషల్లో మంచి క్రేజ్ అండ్ బజ్ ఏర్పడేలా చేసింది అని చెప్పొచ్చు.

దాంతో బిజినెస్ దృశ్యా కుమ్మేస్తున్న ఈ సినిమా మొత్తం మీద ఆంధ్ర ఏరియాలో 16 కోట్ల నుండి 18 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు నైజాం ఏరియా కి గాను ఈ సినిమా కి అల్టిమేట్ ఆఫర్ కన్ఫాం అయిందట.

ఓవరాల్ గా 7.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాం ఏరియా కి గాను ఈ సినిమా కి దక్కినట్లు సమాచారం. ఇది విజయ్ దేవరకొండ కెరీర్ లో హైయెస్ట్ గా చెప్పుకోవచ్చు. మే ఎండింగ్ లో రాబోతున్న ఈ సినిమా తో విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here