యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అవ్వగా సినిమా కి మరీ అద్బుతమైన టాక్ కాకునా ఎబో యావరేజ్ రేంజ్ టాక్ వచ్చింది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక చేతులెత్తేసింది. సినిమా అన్ని ఏరియాల్లో 5 వ రోజు నుండే నెగటివ్ షేర్స్ రావడం మొదలు అవ్వగా…
రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని ఏరియాల్లో ఎలాగోలా 50% కి పైగా రికవరీ అయిన ఈ సినిమా ఒక్క సీడెడ్ ఏరియా లో మాత్రం భారీ నష్టాలను సొంతం చేసుకుంది. సినిమా ను సీడెడ్ లో 3.6 కోట్లకు అమ్మారు. కాగా సినిమా ఇప్పటి వరకు సీడెడ్ ఏరియాలో సాధించిన షేర్…
కేవలం 1.25 కోట్ల లోపే ఉండటం భారీ షాక్ ఇచ్చింది, కాగా ఫైనల్ రన్ లో 1.3 కోట్ల లోపే పరుగు ని ముగించవచ్చని అంటున్నారు. దాంతో ఈ ఒక్క ఏరియాలోనే సినిమా 2.3 కోట్ల మేర నష్టపోనుంది. మిగిలిన ఏరియాల లాస్ కన్నా ఈ ఏరియాలో లాస్ భారీగా ఉందని చెప్పొచ్చు.