బాక్స్ ఆఫీస్ దగ్గర పోయిన వీకెండ్ లో రిలీజ్ అయిన కింగ్ నాగార్జున మరియు నాచురల్ స్టార్ నాని ల దేవదాస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకుంది…మొదటి రోజు కుమ్మెసినా రెండు మూడు రోజుల్లో స్లో డౌన్ అయింది.
కానీ 4 వ రోజు మళ్ళీ ఓ రేంజ్ లో గ్రోత్ ని సాధించిన ఈ సినిమా 4 రోజుల్లో టోటల్ గా 17.41 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 4 వ రోజు తో పోల్చితే 55% డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. వర్కింగ్ డే అవ్వడంతో డ్రాప్ కామన్ అనే చెప్పాలి.
కానీ ఓవరాల్ గా 5 వ రోజు సినిమా 1.5 నుండి 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు…ఇక 6 వ రోజు అక్టోబర్ 2….గాంధీ జయంతి సెలవు సినిమాకి ఓ రేంజ్ లో కలిసి వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.