బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దేవర(Devara Part 1) సినిమా ఊహకందని రేంజ్ లో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ ఉండగా….5వ వారంలో కూడా షేర్స్ ని రాబడుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే…
మేజర్ గా కలెక్షన్స్ ని రాబడుతూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం ఆల్ మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఆల్ రెడీ కేరళలో త్వరగానే రన్ ని పూర్తి చేసుకున్న సినిమా తర్వాత తమిళనాడులో కూడా రన్ ని పూర్తి చేసుకుంది… సినిమా తమిళనాడులో ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్…
6 కోట్ల రేంజ్ లో జరిగింది…సినిమా జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన అక్కడ లాంగ్ రన్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది. టోటల్ రన్ లో సినిమా తెలుగు అండ్ తమిళ్ వర్షన్ లు కలిపి…
11.10 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది….షేర్ ఓవరాల్ గా 4.16 కోట్ల దాకా దక్కించుకున్న సినిమా మొత్తం మీద 6 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ లో ఇక్కడ 70% రేంజ్ కి అటూ ఇటూగానే రికవరీని ఓవరాల్ గా సొంతం చేసుకుని పరుఇగును పూర్తి చేసుకుంది…
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్న దేవర మూవీ కి ఒక్క తమిళనాడులో మాత్రమే అనుకున్న రేంజ్ లో అంచనాలను అయితే అందుకోలేక పోయింది….దాంతో అన్ని చోట్లా కుమ్మేసిన సినిమాకి ఈ ఒక్క చోట మాత్రం దెబ్బ పడినట్లు అయింది.