లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర క లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్ రూబ(Dilruba Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా…
రాగా సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వగా ఓపెనింగ్ డే నుండే ఏమాత్రం జోరుని చూపించ లేక పోయింది. దాంతో కలెక్షన్స్ పరంగా ఏ దశలో కూడా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి…
1.17 కోట్ల షేర్ ని 2.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మొదటి వారం పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 1.35 కోట్ల షేర్ ని డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 2.85 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా…
1.02 కోట్ల రేంజ్ లో షేర్ ని 2.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా రెండో వీక్ లో సినిమా ఆల్ మోస్ట్ 90% థియేటర్స్ నుండి తొలగించడంతో ఇక తేరుకునే అవకాశమే లేకుండా పోయింది. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్ల రేంజ్ లో ఉండగా…
ఫస్ట్ వీక్ లోనే చేతులు ఎత్తేసిన సినిమా భారీ లెవల్ లో లాస్ ను సొంతం చేసుకుంది. 40 కోట్ల బ్లాక్ బస్టర్ క మూవీ తర్వాత అందులో సగం అయినా ఇంపాక్ట్ ను చూపెడుతుంది అనుకున్న దిల్ రూబ సినిమా ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక మొదటి వీక్ కే ఔట్ అయిపొయింది.