2019 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) సినిమాకి సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie Review) ఫ్లాఫ్స్ లో ఉన్న ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) కి అలాగే పూరీ జగన్నాథ్ కి తిరిగి ఊపిరి పోసిందా…లేదా తెలుసుకుందాం పదండీ….ముందుగా కథ పాయింట్ కి వస్తే….
మల్టీ మిలియనీర్ అయిన సంజయ్ దత్ 100 ఏళ్ళు బ్రతకాలి అని ఆశ పడతాడు కానీ బ్రెయిన్ ట్యూమర్ వలన కొన్ని నెలలకే చనిపోతాను అని తెలియడంతో తన మెమొరీని ట్రాక్స్ ఫెర్ చేయాలి అనుకుంటాడు…అప్పుడు తనకి హీరో గురించి తెలుస్తుంది….మరి ఆ తర్వాత కథ ఏం జరిగింది…. హీరోకి సంజయ్ దత్ కి ఉన్న లింక్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….
పూరీ జగన్నాథ్ చెప్పినట్లు ఇస్మార్ట్ శంకర్ తో పోల్చితే డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కథ పాయింట్ ఉంది…కానీ ఆ కథ పాయింట్ చెప్పే విధానంలో పూరీ మళ్ళీ ట్రాక్ తప్పాడు….హీరో క్యారెక్టర్ విషయంలో ఎలాంటి వంక పెట్టడానికి లేదు కానీ మిగిలిన కథ విషయంలో మాత్రం చాలా డొంకలే ఉన్నాయి డబుల్ ఇస్మార్ట్ సినిమాలో…..
రామ్ మాత్రం ఇస్మార్ట్ శంకర్ లా పరకాయ ప్రవేశం చేశాడు, తన డైలాగ్స్, స్క్రీన్ ప్రజెన్స్, డాన్సులు, మాస్ యాటిట్యూడ్ హీరోయిజం ఎలివేట్ సీన్స్ అన్నింటిలో కుమ్మేశాడు….హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా సంజయ్ దత్ రోల్ బాగున్నా డబ్బింగ్ సెట్ అవ్వలేదు…ఆలీ కామెడీ పరమ రోత పుట్టించేలా డిసైన్ చేశారు సినిమాలో…
సంగీతం ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించింది….ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు…ఫస్టాఫ్ వరకు విలన్ కథతో మొదలు అయ్యి హీరో ఎంట్రీ తన లవ్ స్టోరీ తో సాగి మెయిన్ పాయింట్ ఇంటర్వెల్ టైంకి మొదలు అవ్వగా…
సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి కానీ సెకెండ్ ఆఫ్ ని నాసిరకంగా డీల్ చేశాడు డైరెక్టర్…ఇక క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ రిలీజ్ కి ముందు చెప్పారు కానీ అతి సాదాసీదా క్లైమాక్స్ మాత్రమే…. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ ఒకప్పటి ఫామ్ ను మాత్రం అందుకోలేక పోతున్నాడు….
ఉన్నంతలో పూరీ లాస్ట్ మూవీ లైగర్ తో పోల్చితే బెటర్ ఔట్ పుట్ అని చెప్పొచ్చు, కానీ వెంటనే ఆ అలీ కామెడీ సీన్స్ ని డిలేట్ చేయకపోతే మట్టుకు ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది…ఇస్మార్ట్ శంకర్ లో కథ లేదు కానీ ఆ క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ కి నచ్చింది….సాంగ్స్ నచ్చాయి…ప్రీ క్లైమాక్స్ కూడా నచ్చింది…
కానీ డబుల్ ఇస్మార్ట్ లో రామ్ ఒక్కడు తను సినిమాను సేఫ్ చేయడానికి ఎంత చేయాలో అంత చేశాడు…కానీ పూరీ రీసెంట్ మూవీస్ లో ఉండే అదే లౌడ్ సీన్స్, ఓవర్ ది టాప్ స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆకట్టుకోలేదు…ఫస్టాఫ్ ఎలాగోలా యావరేజ్ అనిపించినా సెకెండ్ ఆఫ్ లో చాలా సీన్స్ సహనానికి పరీక్ష పెడతాయి…. మొత్తం మీద రన్ టైం ని తగ్గించి అలీ కామెడీ సీన్స్ ని డిలేట్ చేస్తే…
రామ్ క్యారెక్టర్ కోసం, అక్కడక్కడా వర్కౌట్ అయిన కొన్ని సీన్స్ అలాగే సాంగ్స్ కోసం ఒకసారి చూడొచ్చు కానీ చాలా ఓపిక అవసరం అని చెప్పాలి….మొత్తం మీద ఇస్మార్ట్ శంకర్ ను మ్యాచ్ అయితే చేయలేక పోయిన డబుల్ ఇస్మార్ట్ లైగర్ మూవీ మీద మాత్రం కొంచం బెటర్ అని చెప్పాలి…ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….